తెలుగు

ప్రార్థించడం

నాతో మాట్లాడటం ద్వారా, మీ జీవితకాలంలో మీరు
  ఎదుర్కొనేవాటిని అర్థం చేసుకునేలా నేను మీకు సహాయపడగలను.
నాతో గడిపే ఆ సమయం ప్రశాంతంగా ఉండాలి.

మనం ఒకరినొకరం సన్నిహితంగా తెలుసుకోవాలి.
నాతో మాట్లాడటం ద్వారా, వినడం, చూడటం ద్వారా,
  మీ చుట్టూ నేను చేసే కార్యాలను గుర్తించడం ద్వారా ఇలా చేయండి.

మీరు సంతోషంగా, ఆనందభరితంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని
  మీకు చూపించే నా మార్గం ఇదే.
మీ ప్రార్థన మనసు విప్పి చేసేదిగా, శాంతితో నిండినదిగా ఉండాలి.
నన్ను లోతుగా తెలుసుకునేందుకు నాతో సమయం గడపండి.

నేను మీకు ఎన్నో సూచనలను, ఆశీర్వాదాలను ఇస్తాను,
  మీ ప్రార్థనల విషయంలో మీకు మరింత నమ్మకం కలగడానికి సహాయపడేలా.

మీ భారాలను నా దగ్గర ఉంచడానికి భయపడకండి,
  ఎందుకంటే నా దృష్టిలో అవి చిన్నవే.

మీరు మరింతగా అడిగేందుకు నేను అంతకంతకూ సహాయపడతాను.
మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు చెప్పండి; నాపట్ల ఈ ప్రేమను మీ జీవితంలో ఆచరించండి.
మీ చుట్టూ ఉన్నవారితో మీ ప్రవర్తనలో ఇలా చేయవచ్చు.

స్వార్థపూరితంగా గానీ అసహనంగా గానీ ఉండకండి,
  నాతో మీరు గడిపే సమయం విషయంలో,
  ఎందుకంటే అలా ఉండటం నా శాంతికి దారితీయదు.

తదుపరి ధ్యానం

విషయ సూచిక