మీకు లభించిన ఈ సమయం నేను ఇచ్చిన వరం.
దానిని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించండి,
ఎందుకంటే నేను నిర్ణయించినప్పుడు అది ముగుస్తుంది.
ఇతరుల అవసరాలు తీర్చడానికి ఈ వరాన్ని ఉపయోగించండి.
వారు తమ వరాలను ఆనందంగా అనుభవించడానికి తోడ్పడండి,
నేను మీకు తోడ్పడుతున్నట్లే.
మీరు మీ వరాలను నా నుండి కోరుదురుగాక.
మీరు అపారమైన ఆనందాన్ని అందించుదురుగాక
మీ చుట్టూ ఉన్నవారికి.
ఇంతకంటే గొప్ప దానం మరేదైనా ఉంటుందా?
మీకు పరిచయమయ్యేవారికి శాంతిని చేకూర్చండి.
వారికి ఆనందాన్ని, శాంతిని ఇవ్వండి.
బాధపడుతున్నవారికి జీవాన్ని అందించండి.
ఈ బాధాకరమైన కాలాన్ని దాటడానికి వారికి తోడ్పడండి.
తమ పరిస్థితులపై కోపంగా ఉన్నవారితో సౌమ్యంగా మెలగండి.
వారు మీకు తారసపడినప్పుడు వారికి వివేకాన్ని అందించండి.
మీ కళ్లలో కరుణ ప్రస్ఫుటంగా కనిపించనివ్వండి
అది వారి బాధను చేరనివ్వండి.
మీ బలం వారి బాధను నయం చేస్తుంది.
స్వస్థత కోసం నేను వారిని మీ దగ్గరకు తీసుకువస్తున్నాను.
నా బలం వారిలోకి ప్రవహించనివ్వండి.
ఈ ప్రజలకు నా బలం అవసరం.
ఈ ప్రయోజనం కోసం మిమ్మల్ని ఉపయోగించుకోనివ్వండి.
