తెలుగు

ఉపవాసం, మాంసాహార వర్జనం

బూడిద బుధవారం, శుభ శుక్రవారం కతోలికులకు ఉపవాసం, మాంసాహార వర్జనం తప్పనిసరిగా పాటించవలసిన రోజులు. అదనంగా, తపస్సుకాలంలోని శుక్రవారాలు మాంసాహార వర్జనం తప్పనిసరిగా పాటించవలసిన రోజులు.

లాటిన్ కతోలిక సభ సభ్యులకు 18 సంవత్సరాల వయస్సు నుంచి 59 సంవత్సరాల వయస్సు వరకు ఉపవాస నియమాలు తప్పనిసరి. ఉపవాసం పాటించేటప్పుడు, ఒక పూట పూర్తి భోజనంతో పాటు మరో రెండు పూటలు కొద్దిపాటి ఆహారం తీసుకోవచ్చు. అయితే ఆ రెండు పూటల ఆహారం కలిపినా ఒక పూర్తి భోజనానికి సమానం కాకూడదు. మాంసాహార వర్జనానికి సంబంధించిన నియమాలు లాటిన్ కతోలిక సభ సభ్యులకు 14 సంవత్సరాల వయస్సు నుంచి తప్పనిసరిగా వర్తిస్తాయి

పూర్వాచార కతోలిక సభల సభ్యులు తమ స్వంత స్వయంప్రతిపత్తిగల సభకు చెందిన ప్రత్యేక చట్టాన్ని పాటించాలి.

వీలైతే, ప్రభువైన యేసు శ్రమలను, మరణాన్ని గౌరవించడానికి, ఆయన పునరుత్థానంలో మరింత సంపూర్ణంగా పాలుపంచుకోవడానికి, మరింత సంసిద్ధతతో దానిని వేడుకగా జరుపుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకునేందుకు, శుభ శుక్రవారపు ఉపవాసాన్ని పాస్కా జాగరణ (పవిత్ర శనివారం రాత్రి) వరకు “పాస్కా ఉపవాసం”గా కొనసాగిస్తారు.


మూలం: usccb.org