తెలుగు

సంతృప్తి

నా నిరీక్షణ తప్ప మరే నిరీక్షణ ఉంది?
మరే ప్రోత్సాహం ఉంది
  నా ప్రోత్సాహం తప్ప?
నా ప్రేమకంటే బలమైన ప్రేమ ఏది?

పీల్చే ఒక్క శ్వాసకైనా అర్థం లేదు
  నా మార్గదర్శకత్వం లేకుండా.
మీ రోజులో ఒక్క నిమిషానికైనా విలువ లేదు
  నా నిర్దేశం లేకుండా.

నా మార్గాన్ని అనుసరించి మీ దారిని చూడండి.
నా పద్ధతులను వెదకి మీ దిశను అర్థం చేసుకోండి.
నా మాటలను అంగీకరించి నా ప్రణాళికను తెలుసుకోండి.

ఒక్క క్షణం కూడా గడవదు
  మీరు నా దృష్టిలో లేకుండా.
నేను ఎల్లప్పుడూ మీలోనే ఉన్నాను.
నా సాన్నిధ్యాన్ని వెదకండి
  నేను మీతో ఉన్నానని తెలుసుకోండి.
నా స్వభావాన్ని తెలుసుకోండి
  మీ పట్ల నాకు శ్రద్ధ ఉందని గ్రహించండి.
మీ సమయమంతటినీ నా స్వభావం ఆవరించనివ్వండి
  గడిచే ప్రతి రోజూ మీకు సంతృప్తిని
  మరియు తృప్తిని చేకూర్చేలా.

తదుపరి ధ్యానం

విషయ సూచిక