అన్నిటికన్నా ముఖ్యమైనది
మీ పట్ల నాకున్న ప్రేమే.
అది వర్షంవంటిది
తాను కురిసే వాటన్నిటినీ
శుద్ధి చేస్తుంది కనుక.
అది సూర్యునివంటిది
సమస్త జీవులకు
సేదదీర్పును ఇస్తుంది కనుక.
అది గాలివంటిది
తన పోషణ అవసరమైన అన్నిటికీ
జీవాన్ని ఇస్తుంది కనుక.
ప్రేమ స్వభావం ఇదే అయితే,
దానివల్ల కలిగే మేలులను స్వీకరించండి.
ప్రేమ ఆశీర్వాదాలను అంగీకరించండి
దాని ఫలాలను పంచుకోండి
మీ దారిలో తారసపడేవారితో.
