తెలుగు

కుటుంబాల కొరకు ప్రార్థన

ప్రేమమయుడవూ కరుణామయుడవూ అయిన మా తండ్రి దేవా, కుటుంబాలన్నిటినీ ఒకటిగా చేర్చి, ప్రేమలోనూ పరస్పర సహకారంలోనూ పరిపూర్ణ ఐక్యతతో నిలుపుము.

కుటుంబంలోని ప్రతి ఒక్కరిలో ఒకరినొకరు అర్థం చేసుకునే మనసును, పరస్పర ఆప్యాయతను కలిగించుము.

కలహాలను, ద్వేషభావాలను వారికి దూరంగా ఉంచుము; అప్పుడప్పుడు జరిగే వారి తప్పిదాల విషయంలో క్షమాగుణాన్ని, శాంతిని వారిలో కలిగించుము.

తల్లిదండ్రుల పరస్పర ప్రేమానురాగాలు మంచి ఆదర్శంగా నిలవుగాక.

పిల్లలు ఇతరులను గౌరవిస్తూ, పరిణతితో కూడిన స్వతంత్రతలో ఎదిగేలా వారిలో ఆత్మగౌరవాన్ని పెంపొందించుము.

మా ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు ద్వారా, కుటుంబాలలోని పరస్పర ఆప్యాయత, గౌరవం ఇహపరాలలో క్రైస్తవ జీవితానికి చిహ్నంగా ఉండుగాక.

ఆమెన్.


మరిన్ని ప్రార్థనలు

దైనందిన ధ్యానాలు