తెలుగు

క్రీస్తు రాజుకు ప్రార్థన

మా దేవుడవైన ప్రభువా, నీవు మాత్రమే సమస్త జాతులకు పరమపవిత్రుడవైన రాజువు, పాలకుడవు.

ప్రభువా, దివ్యరాజా, నీ నుండి కారుణ్యం, శాంతి, న్యాయం, సమస్త మేలులు పొందుతామనే గొప్ప ఆశతో నిన్ను ప్రార్థిస్తున్నాము.

మా రాజువైన ప్రభువా, మా కుటుంబాలను, మా జన్మభూమిని రక్షించు.

పరమ విశ్వాసపాత్రుడా, మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాము.

మా శత్రువుల నుండి, నీ న్యాయతీర్పు నుండి మమ్మల్ని రక్షించు.

సర్వాధికారివైన రాజా, నీకు విరోధంగా మేము చేసిన పాపాలను క్షమించు.

యేసూ, నీవు కారుణ్య రాజువు.

నీ న్యాయతీర్పుకు మేము పాత్రులమయ్యాము

ప్రభువా, మమ్మల్ని కరుణించి క్షమించు.

నీ మహా కారుణ్యంపై మేము నమ్మకం ఉంచుతున్నాము.

అత్యంత భయభక్తులను కలిగించే రాజా, నీ ముందు శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాము;

నీ పరిపాలన, నీ రాజ్యం భూమిపై గుర్తించబడుగాక.

ఆమెన్.


మరిన్ని ప్రార్థనలు

దైనందిన ధ్యానాలు