తెలుగు

క్రిస్మస్ ప్రార్థన

క్రిస్మస్ శుభాకాంక్షలు!

సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక!

నా ప్రియాతిప్రియ ప్రభువా, యేసూ,

గాఢమైన ప్రేమతో నిన్ను ఆరాధిస్తూ, నీ జనన వేడుకలో ఆనందిస్తున్నాను.

మాపై నీ ప్రేమ అగాధమైనది,

అది మహిమాన్వితమైనది

రూపాంతరం కలిగించేది,

విస్మయాన్ని కలిగించేది,

ఎంతో వ్యక్తిగతమైనది.

నీవు వచ్చి మా మధ్య నివసించాలని ఎంచుకున్నావు,

పేదరికంలో, తిరస్కారంలో, వినమ్రతలో జన్మించావు.

అయినా నీ తల్లికి తాను ఎవరికి జన్మనిచ్చిందో తెలుసు,

ఆమె హృదయం అత్యంత వాత్సల్యపూరితమైన ప్రేమతో నిండిపోయింది

తన బిడ్డను, తన దేవుణ్ణి ఆరాధిస్తూ.

ప్రియ ప్రభువా, నాకు సహాయం చేయుము.

నీ తల్లి హృదయంతో నిన్ను ప్రేమించేందుకు.

పునీత యోసేపుతోను, పేద గొర్రెల కాపరులతోను కలిసి నిన్ను ఆరాధించేందుకు నన్ను ఆహ్వానించుము.

నీ జననపు మహిమాన్విత శక్తిని నాకు వెల్లడించుము

నిన్ను నీవే సంపూర్ణంగా అర్పించుకున్న ఈ వరం ద్వారా నా జీవితాన్ని మార్చుము.

ప్రియ ప్రభువైన యేసూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

నా పూర్ణహృదయంతో నిన్ను ప్రేమించేందుకు నాకు సహాయం చేయుము.

నవజాత లోకరక్షకుడా,

నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మరియ తల్లీ, పునీత యోసేపూ,

నా కొరకు, అందరి కొరకు ప్రార్థించండి.

ఆమెన్.


మరిన్ని క్రిస్మస్ ధ్యానాలు: