తెలుగు

శాంతి

మీరు ప్రేమించేవారితో కలిసి ఉన్నప్పుడు,
  నేను ఆనందిస్తాను.
నన్ను స్తుతించడానికి, ఒకరినొకరు ప్రశంసించుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి.
మీలో ప్రతి ఒక్కరూ శాంతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను,
  మీకు అత్యంత సన్నిహితులైనవారితో.
ఈ శాంతి, మీరు ఊహించేదానికి అతీతమైనది,
  దాని స్థితిని మీరు
  మీ మానవ అవగాహనతోను సంబంధాలతోను ముడిపెట్టి ఆలోచించినప్పుడు.
నా శాంతి మీ గ్రహింపులకు, అంచనాలకు,
  అవగాహనలకు అతీతమైనది.

నేను మీకు ఇచ్చే శాంతి సంపూర్ణమైనది, అరకొరైనది కాదు.
నేను మీకు ఇచ్చే శాంతి వెలుగు, చీకటి కాదు.
నేను మీకు ఇచ్చే శాంతి నాది, మీది కాదు.

నేను మీకు ఇచ్చేదాన్ని స్వీకరించండి
  ఈ వరం మీకు అత్యంత సన్నిహితులైనవారికి కూడా అందేలా చేయండి.
మీరు ఎందుకు దీవెనలు పొందుతున్నారో మీరు అర్థం చేసుకోనవసరం లేదు.
నా శాంతిని మీతో తీసుకువెళ్లి, ఇతరుల మేలు కోసం ఉపయోగించండి.

నా శాంతి మిమ్మల్ని మార్చి, బలపరుస్తుంది.
నా శాంతి మిమ్మల్ని నాకు దగ్గర చేస్తుంది.
దీని కోసం అడగండి.

భయపడకండి
  మీలో కనిపించే మార్పును చూసి.
భయపడకండి
  మీతో ఉన్నవారితో ఈ శాంతిని పంచుకోవడానికి.
ఈ ఉద్దేశం కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను.

నన్ను మీలో ఉండనివ్వండి.
మీ మాటలు నా మాటలుగా ఉండనివ్వండి.
నా మాటలు మీ ద్వారా, వాటిని వినవలసినవారికి ప్రవహిస్తాయి.
మిమ్మల్ని ఉపయోగించుకోనివ్వండి. మిమ్మల్ని దీవించనివ్వండి.

తదుపరి ధ్యానం

విషయ సూచిక