దిశానిర్దేశం, మార్గదర్శనం కోసం మీరు
నన్ను ఆశ్రయించినప్పుడు,
నేను సమాధానమిస్తాను.
నేను మీకు అనుగ్రహించే సమాధానాలను ముందుగానే ఊహించవద్దు.
ఊహించని సంకేతాలను, ప్రభావాలను
ఆలకించండి.
తరచుగా ప్రార్థించండి;
ఏది సత్యమో నిర్ధారించుకోవడానికి
ఇది మీకు సహాయపడుతుంది.
అతిగా స్పందించవద్దు,
ఎందుకంటే నా మార్గదర్శనాన్ని అడిగి,
నా నుండి దిశానిర్దేశం కోరేవారిపై
నేను ఒత్తిడి పెట్టను.
మీరు నన్ను అనుమతిస్తే, నేను మీ జీవితానికి మార్గనిర్దేశం చేస్తాను.
