తెలుగు

ఆగమనకాలంలో పిల్లల ప్రార్థన

నిద్రకు ముందు లేదా ఆదివారం దివ్యబలిపూజకు ముందు మీ పిల్లలతో కలిసి ప్రార్థించడానికి

నా చిన్నారి ప్రభువైన యేసూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ ఆగమనకాలానికై నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నీవు నా కోసం చేసినదంతా అర్థం చేసుకోవడానికి దయచేసి నాకు సహాయం చేయి. నీ ప్రేమమయి తల్లి నిన్ను తన హృదయంలో నిలుపుకొని, ఈ లోకంలోకి తీసుకువచ్చారు. నేను కూడా అలాగే చేయడానికి నాకు సహాయం చేయి.

 నా ప్రియమైన యేసూ, ఈ ఆగమనకాలంలో నేను నిన్ను నా రాజుగా, నా దేవునిగా ఎంచుకుంటున్నాను. నన్ను నీకు దగ్గరగా చేర్చుకో. నేను మార్చుకోవాలని నీవు కోరే విషయాలను మార్చుకోగలిగేలా, నా పాపాలను గుర్తించడానికి నాకు సహాయం చేయి. 

మరియమాతా, దేవుడు నన్ను చేయమని కోరేవన్నీ నేను చేయగలిగేలా ఈ ఆగమనకాలంలో నా కోసం ప్రార్థించు. దేవుడు నిన్ను అడిగిన ప్రతిదానికీ నీవు “అవును” అని చెప్పావు. నేను కూడా అలాగే చేయగలిగేలా దయచేసి నా కోసం ప్రార్థించు.

ప్రభువైన యేసూ, రమ్ము,

ప్రభువైన యేసూ, రమ్ము,

రా, ప్రభువైన యేసూ, రా!

యేసూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

ఆమెన్.