తెలుగు

మానసిక కుంగుబాటులో సహాయం

ఓ క్రీస్తు యేసూ,

అంతా చీకటిగా ఉన్నప్పుడు
నా బలహీనతను, నిస్సహాయతను నేను అనుభవిస్తున్నప్పుడు,
నీ సన్నిధిని,
నీ ప్రేమను, నీ బలాన్ని నేను అనుభూతి చెందేలా చేయుము.
పరిపూర్ణమైన నమ్మకం ఉంచేలా నాకు సహాయపడుము—
నన్ను కాపాడే నీ ప్రేమపై
నాకు బలాన్నిచ్చే నీ శక్తిపై,
తద్వారా ఏదీ నన్ను భయపెట్టకుండా, కలవరపెట్టకుండా ఉండుగాక,
ఎందుకంటే, నీకు సన్నిహితంగా జీవిస్తూ,
నీ హస్తాన్ని,

నీ ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని అన్నిటిలోనూ నేను దర్శిస్తాను.

ఆమెన్.

 లయోలాకు చెందిన పునీత ఇగ్నేషియస్ రచన