తండ్రీ, ఈ నూతన దినాన్ని నీకు సమర్పిస్తున్నాను;
నా పనులు చేసుకుంటూ.
నాకు పరిచయమయ్యే వారిని ఆశీర్వదించమని నిన్ను వేడుకుంటున్నాను.
ప్రభూ, స్త్రీపురుషులందరి కోసం ప్రార్థిస్తున్నాను
తమ జీవనోపాధి కోసం పనిచేసే వారందరి కోసం;
వారు చేసే పనిలో వారికి సంతృప్తిని ప్రసాదించు.
దేవుని ఆత్మా,
నిరుద్యోగులను, వారి కుటుంబాలను ఆదరించు;
వారు నీ బిడ్డలు, నా సోదరసోదరీమణులు.
వారికి త్వరగా పని దొరికేలా సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను.
ఆమెన్.
పునీత ఇగ్నేషియస్ లయోలా రచన