దృష్టి సారించి నా ప్రణాళికను చూడండి.
చెవియొగ్గి నా నిర్దేశాన్ని వినండి.
గమనించి నా నియంత్రణను అర్థం చేసుకోండి.
నా సాన్నిధ్యాన్ని ఆస్వాదించి, స్వీకరించండి.
మీరు కోరుకోగల మరింత గొప్ప ఆనందం ఏది?
పొందగల మరింత గొప్ప సంతృప్తి ఏది?
ఇంతకంటే ఫలప్రదమైన శాంతి ఏది?
ఇంతకంటే సత్యమైన గమ్యం ఏది?
వెదకి నా సత్యాన్ని కనుగొనండి.
మీకోసం ఉన్న నా ప్రణాళికను అన్వేషించి, తెలుసుకోండి.
మీకోసం ఉంచిన నా శాంతిని ఆస్వాదించండి.
మరేదీ మీకు సంతృప్తిని ఇవ్వదు.
