- ప్రభువు జ్ఞానస్నానం
- రెండు పతాకాలు
- మూడు వర్గాల మనుషులు
- శోధన
- అపొస్తలుల పిలుపు
- కానాలో వివాహం
- దేవాలయ శుద్ధీకరణ
- కొండమీది ప్రసంగం
- తుఫానును శాంతింపజేయడం
- నీటిపై నడవడం
- బోధించడానికి పంపబడిన అపొస్తలులు
- మగ్దలా మరియమ్మ పరివర్తన
- క్రీస్తు ఐదువేల మందికి ఆహారం ఎలా సమకూర్చారు
- క్రీస్తు దివ్యరూప ప్రకాశనం
- లాజరు పునరుత్థానం
- బేతనియలో విందు
- వినయానికి మూడు మార్గాలు
పేపర్‌బ్యాక్ మరియు ఈ-పుస్తక రూపాల్లో లభ్యం:
అమెజాన్ – గూగుల్ ప్లే– ఐట్యూన్స్ – బార్న్స్ & నోబుల్
పరిచయం
ఈ విభాగంలోని పదిహేడు ధ్యానాలు సంవత్సరంలో సామాన్యకాలం వచ్చే రెండు దశల్లో ఉపయోగించబడతాయి. ఈ విభాగంలోని ధ్యానాల్లో ఎక్కువ భాగం ఆధ్యాత్మిక సాధనలు గ్రంథంలోని “రెండవ వారం” నుండి తీసుకోబడ్డాయి.
మొదట, క్రీస్తు జయంతి కాలం ముగిసిన తరువాత, సామాన్యకాలపు మొదటి ఆదివారం స్థానంలో వచ్చే ప్రభువు జ్ఞానస్నాన పండుగతో ప్రారంభించండి. విభూతి బుధవారం ఎప్పుడు వస్తుందనే దాన్ని బట్టి సామాన్యకాలంలోని ఈ దశ నిడివి ప్రతి సంవత్సరం మారుతుంది. అందువల్ల, తపస్సుకాలానికి ముందున్న ఈ సామాన్యకాల దశలో మీరు ఈ ధ్యానాల్లో కొన్నింటిని మాత్రమే ఉపయోగిస్తారు.
పవిత్రాత్మ ఆగమన మహోత్సవ వేడుకతో పాస్కా కాలం ముగిసిన తరువాత ఈ విభాగంలోని మిగిలిన ధ్యానాలను ఉపయోగించాలి. అలా, సామాన్యకాలం తిరిగి ప్రారంభమైనప్పుడు ఈ విభాగంలోని మిగిలిన ధ్యానాలు ఉపయోగించబడతాయి. సామాన్యకాలపు తరువాతి భాగంలో, వేసవి చివర్లో లేదా శరదృతువు ప్రారంభంలో మీరు ధ్యానాలన్నింటినీ పూర్తి చేస్తే, ఆ సంవత్సరమంతటిలో మిమ్మల్ని అత్యంత లోతుగా స్పృశించిన ధ్యానాల్లో కొన్నింటిని మళ్లీ ధ్యానించవచ్చు.
