తెలుగు

పాస్కాకాల ధ్యానాలు

పాస్కా కాల ధ్యానాలకు పరిచయం

  1. యేసు పునరుత్థానం మరియు మొదటి దర్శనం
  2. రెండవ దర్శనం
  3. మూడవ దర్శనం
  4. నాలుగవ దర్శనం
  5. ఐదవ దర్శనం
  6. ఆరవ దర్శనం
  7. ఏడవ దర్శనం
  8. ఎనిమిదవ దర్శనం
  9. తొమ్మిదవ దర్శనం
  10. మరిన్ని దర్శనాలు
  11. యేసు స్వర్గారోహణం
  12. దైవప్రేమను పొందేందుకు దైవచింతన

ప్రధాన చిత్రం: లూకా జోర్దానో – పునరుత్థానం

విషయ సూచిక

పేపర్‌బ్యాక్ మరియు ఈ-పుస్తక రూపాల్లో లభ్యం:

అమెజాన్ – గూగుల్ ప్లే– ఐట్యూన్స్ – బార్న్స్ & నోబుల్


పరిచయం

పదకొండు ధ్యానాలున్న ఈ విభాగంలో, పునరుత్థానం తరువాత క్రీస్తు ఇచ్చిన వివిధ దర్శనాలపై, అలాగే ఆయన స్వర్గారోహణంపై మీరు దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ విభాగంలోని ధ్యానాలు, సాధనలు పునీత ఇగ్నేషియస్ రచించిన ఆధ్యాత్మిక సాధనలు గ్రంథంలోని “నాలుగవ వారం” ఆధారంగా రూపొందించబడ్డాయి. వీటిని పాస్కా పండుగతో ప్రారంభించి, పెంతెకోస్తు మహోత్సవాన్ని జరుపుకునే పాస్కా కాలం ముగింపు వరకు ఉపయోగించాలి.

నేపథ్యాన్ని తెలియజేయడానికి ఈ విభాగంలోని ధ్యానాలు పవిత్ర లేఖనానికి పరిచయాన్ని అందిస్తాయి. తరువాత మీరు నెమ్మదిగా, శ్రద్ధగా, ప్రార్థనాపూర్వకంగా ధ్యానించేందుకు లేఖనభాగాలు ఇవ్వబడతాయి. ఇగ్నేషియస్ బోధించిన ధ్యాన, దైవచింతన పద్ధతులలో మీకు ఇప్పటికే మంచి పరిచయం ఉందనే ఆశతో, ఈ దశలో బుల్లెట్ గుర్తులతో సూచనాంశాలు ఇవ్వడం లేదు. కాబట్టి, లేఖనభాగపు నేపథ్యాన్ని చదివిన తరువాత, మీ ధ్యానానికి కేవలం ఆ లేఖనభాగాన్నే ఉపయోగించడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు ఆ సందర్భంలో ఉంచుకొని, ప్రతి పంక్తిని ఆస్వాదిస్తూ, పవిత్రాత్మ తన చిత్తానుసారం మీతో మాట్లాడటానికి అనుమతించండి.