తెలుగు

నేను విశ్రాంతి తీసుకోవచ్చా?

నేను విశ్రాంతి తీసుకోవచ్చా?
పూర్తి చేయలేదుగానీ, నా శాయశక్తులా కృషి చేశాను.
పూర్తికాని పని నన్ను సిగ్గుతో నింపుతోంది,
నింద నాపై పడుతుందేమోనని భయపెడుతోంది.

కళ్ళు మూసుకొని నా తల్లి జోలపాటలు వినాలని
నేను ఎంతగానో తపిస్తున్నాను.
కానీ నా తప్పువల్ల ఏదైనా చెడు జరిగితే,
ఆమె పాట వినే అర్హత నాకు ఉందా?

ఆమె కరుణామయి అని, నా ఆత్మను
అర్థం చేసుకుంటుందని నేను నిజంగా నమ్ముతున్నాను.
అయితే, ఇలా ప్రేమలో సత్యం దొరుకుతుందా,
లేక నా ఆందోళననే నేను నమ్మాలా?

“నీవు ఎన్నడూ నీ శాయశక్తులా కృషి చేయలేదు” అనే
ఆలోచనను అణచాలని పక్కమీద అటూఇటూ పొర్లుతున్నాను,
ఇంతలో పశ్చాత్తాపం కలిగించే జ్ఞాపకాలు
నా కలతకు మరిన్ని కారణాలను ఇస్తున్నాయి.

నా ప్రవర్తనను సమర్థించుకోవాలని చూస్తున్నాను,
“ఎందుకు” అలా చేశానో కారణాలన్నీ ఏకరువు పెడుతున్నాను.
కానీ ఎన్ని వాస్తవాలైనా తొలగించలేవు,
ఇప్పుడు పూర్తిగా మేల్కొన్న నా సందేహాలను.

అందుకే ఆమెకు ప్రార్థిస్తూ వేచి ఉంటాను,
ఆందోళన ఎంతో పొద్దుపోయేవరకు మేలుకొని,
మారుమాట లేకుండా నిద్రలోకి జారుకునే వరకు,
నేను సంపూర్ణ సమర్పణతో విశ్రమిస్తుండగా.

– ఫాదర్ తిమోతి జె. డ్రేపర్

మరిన్ని కవితలు

ప్రధాన చిత్రం: విలియమ్-అడోల్ఫ్ బుగెరో (1825-1905) – దేవదూతల గానం