తెలుగు

పునీత అంద్రేయ క్రిస్మస్ నవదిన ప్రార్థన

క్రింద ఇచ్చిన పునీత అంద్రేయ క్రిస్మస్ నవదిన ప్రార్థనను సాంప్రదాయంగా నవంబర్ 30న, పునీత అంద్రేయ పండుగ రోజు నుండి క్రిస్మస్ ముందురోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.

దేవుని కుమారుడు బెత్లెహేములో తీవ్రమైన చలిలో అర్ధరాత్రివేళ ఒక పశువుల పాకలో అత్యంత నిర్మల కన్యకు జన్మించిన ఆ గడియకు, ఆ క్షణానికి వందనం; అవి ఆశీర్వదింపబడును గాక. ఆ గడియలో నా ప్రార్థనలను ఆలకించి, నా కోరికలను అనుగ్రహించ దయచేయుమని నిన్ను వేడుకుంటున్నాను.

(ఇక్కడ మీ ప్రార్థనా ఉద్దేశాలను తెలియజేయండి)

యేసు క్రీస్తు మరియు ఆయన పరమ ధన్య మాత ద్వారా.

ఆమేన్


ఆగమనకాలం కోసం మరిన్ని