మిమ్మల్ని నడిపించే నా మాటలను నమ్మండి;
మీ తప్పుడు మార్గాలను విడిచిపెట్టండి.
నా మార్గంపై నమ్మకం ఉంచండి
నా ప్రేమను ఎన్నడూ సందేహించకండి.
నేను మిమ్మల్ని తప్పుదారి పట్టించను, మీకు హాని చేయను.
కాబట్టి భయపడకండి
మీ కోసం ఉద్దేశించబడిన దాని గురించి,
ఎందుకంటే దాని గమనమే మిమ్మల్ని నడిపిస్తుంది.
మీ దృష్టి మరలనివ్వకండి
బాధాకరంగా కనిపించేవాటి వల్ల.
కానీ జీవిత భారాలు మిమ్మల్ని
నా వద్దకు నడిపించినప్పుడు ఆనందించండి.
కాబట్టి ఏ బాధ అయినా మీకు దీవెన కాగలదు
నాలో జీవించడానికి మీకు తోడ్పడగలదు.
