నా సహాయాన్ని వేడుకోండి, అది మీ కోసమే ఉంది.
మీకు ఎదురుకానున్న వాటికి భయపడకండి,
ఎందుకంటే ఏ హానీ మీకు కలగనివ్వను.
మీ విన్నపాన్ని నా సింహాసనం వద్దకు తీసుకురండి,
నేను మీ కోరికలను తీరుస్తాను.
నేను మీ పట్ల ఉదారంగా ఉంటాను,
ఎందుకంటే మీ ఆనందం మీకు కలిగించే సంతోషం నాకు ముఖ్యమైనది.
మీకు ఏది మంచిదని ఇతరులు అంటున్నారనేది ముఖ్యం కాదు,
నా కోసం మీకు ఎలాంటి ఆకాంక్షలు ఉన్నాయనేదే ముఖ్యం.
నా కోసం మీకున్న ఆకాంక్ష మిమ్మల్ని
సంకోచించే స్థితి నుండి
మనసువిప్పి నా సాన్నిధ్యాన్ని ఆర్తిగా కోరుకునే స్థితికి నడిపించనివ్వండి.
