తెలుగు

నా భూమిలోకి రండి

మీరు కోరుకునే ప్రతిదానికోసం నా వద్దకు రండి.
ఉనికిలో ఉన్న సమస్తంలో నన్ను వెదకండి.
ప్రస్తుతం ఉన్న సమస్తంలో నన్ను చూడండి.
రాబోయే సమస్తంలో నా సాన్నిధ్యాన్ని ఆశించండి.

నా సాన్నిధ్యానికి మీరు భయపడుతున్నారా?
నా నుండి పారిపోతున్నారా?
నా పవిత్రాత్మతో అనుబంధానికి దూరంగా ఉంటున్నారా?

దూరంగా ఉండే మీ ప్రవర్తనను పక్కనపెట్టి
  నా సాన్నిధ్యంలోకి రండి.
నా హస్తాన్ని చూడండి; అది మిమ్మల్ని ఎలా ఆహ్వానిస్తుందో, మీ మార్గంలో ఎలా నడిపిస్తుందో గమనించండి.
దాని మార్గదర్శకత్వంపై నమ్మకం ఉంచండి; మీకోసం అది ఇచ్చే నిర్దేశాలకు లోబడండి.

మీరు సూచనల కోసం, చిహ్నాల కోసం ఎదురుచూస్తున్నారా?
వాటిని చూడలేని మీ అంధత్వం సందేహాన్ని కలిగిస్తోందా?
చెవియొగ్గి నా మాట వినండి.
దృష్టి సారించి, మీకు నేను చూపే దిశను చూడండి.
నమ్మకం ఉంచండి; నేను మీతో ఉన్నానని తెలుసుకోండి.

ఇది నిజమైతే,
  ఇక ఏ ప్రశ్న, సందేహం లేదా భయం
  మీలో మిగిలి ఉండాలి?
ఇది నిజమైతే,
  మరి మీరు ఏ మార్గాన్ని అనుసరిస్తారు?

తదుపరి ధ్యానం

విషయ సూచిక