తెలుగు

మార్పు

మిమ్మల్ని మీరు నూతనపరచుకోండి,
  ఎందుకంటే ఈ మార్పు మిమ్మల్ని
  మీ కోసం ఎదురుచూస్తున్న దానికి సిద్ధపరుస్తుంది.
ఈ మార్పు కోసం ముందుకు సాగండి,
  ఎందుకంటే ఆలస్యం చేయడం మిమ్మల్ని
  నాకు దగ్గర చేయదు.
మార్పులకు భయపడకండి,
  ఎందుకంటే మీకు హాని కలగదు.

నాపై నమ్మకం ఉంచండి;
  మీరు మార్పు చెందుతున్న కాలంలో
  నేను మీ బాగోగులు చూసుకుంటాను.

నా ఆత్మ మిమ్మల్ని
  పైకెత్తి, మీకు వెలుగునిచ్చి,
  అనేక విధాలుగా మీపైకి దిగిరావడం కోసం ఆశతో ఎదురుచూడండి.

మిమ్మల్ని మీరు సమర్పించుకోండి.
ఇంతకంటే గొప్ప కానుకను తండ్రికి ఇవ్వలేరు.
తమ మనస్సులను, హృదయాలను
  నాకు సమర్పించుకునేవారికి
  అనేక ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి.
మీకు శాంతి ప్రసాదించబడుతుంది;
  మీకు తెలియని ఆనందం మిమ్మల్ని ఆవరిస్తుంది.
మిమ్మల్ని మీరు సమర్పించుకోండి,
  ఎందుకంటే ఈ కార్యం
  మిమ్మల్ని నా రాజ్యంలోకి తీసుకువస్తుంది.
మీరు నా వాక్యాన్ని తెలుసుకుంటారు
  మీ చుట్టూ నా సాన్నిధ్యాన్ని చూస్తారు.
మిమ్మల్ని మీరు సమర్పించుకోవడాన్ని
  వాయిదా వేయడానికి మీకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి.

మీ ఆలస్యంలో ఏ జ్ఞానం ఉంది?
నేను లేకుండా ఏ లాభం పొందగలరు?
నా ఆత్మ మిమ్మల్ని నడిపించకుండా ఏ ఓదార్పు ఉంటుంది.
నేను లేకుండా మీరు ఏ లక్ష్యాలను చేరుకున్నారు?
నేను లేకుండా మీరు ఎలా ఉన్నారో చూడండి
  ఆ తరువాత నా ఆత్మ మీలో ఉన్నప్పుడు
  మీరు ఎలా ఉంటారో గ్రహించండి.
మీలో నన్ను ఒక భాగం కానివ్వండి,
  అప్పుడు మీరు నన్ను తెలుసుకుంటారు.
మిమ్మల్ని మీరు సమర్పించుకోండి,
  అప్పుడు నేను ప్రతిరోజూ మీతో ఉంటాను.

తదుపరి ధ్యానం

విషయ సూచిక