తెలుగు

పదవ అధ్యాయం: కతోలిక సభతో ఏకీభావంతో ఆలోచించడానికి నియమాలు

పోరాడే సభ సభ్యులుగా, సభతో ఏకీభావంతో ఆలోచించడానికి పునీత ఇగ్నేషియస్ పద్దెనిమిది నియమాలను అందిస్తున్నారు. “పోరాడే సభ” అనేది భూమిపై ఉంటూ పరలోకాన్ని చేరుకోవడానికి కృషిచేస్తున్న వారందరినీ సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవులందరినీ సూచిస్తుంది.

దేవునికి అత్యధిక మహిమను చేకూర్చడానికి, ఆయన పవిత్ర చిత్తాన్ని నెరవేర్చడానికి తగిన అంతరంగ సంసిద్ధత కలిగి ఉండేలా, మీలో ఉండవలసిన సాధారణ వైఖరులను ఈ నియమాలు తెలియజేస్తాయి. సభ సభ్యులుగా మీ ఆలోచనలకు మార్గనిర్దేశం చేసే నియమాలలో ఈ క్రిందివి ఉన్నాయి:

  • పాపసంకీర్తనం పట్ల, దివ్యసత్ప్రసాద స్వీకరణ పట్ల ప్రేమ
  • దివ్యబలిపూజ, ప్రార్థనలు, ఆరాధనా కర్మలు మొదలైనవాటిలో పాల్గొనడం పట్ల ప్రేమ
  • సన్యాస జీవితాన్ని ప్రశంసించడం
  • పేదరికం, బ్రహ్మచర్యం, విధేయత అనే సువార్తానుసారమైన వ్రతాలను ప్రశంసించడం.
  • పునీతులను, భక్తి ఆచరణలను, ఆశీర్వాద కర్మలను, ఆశీర్వదిత వస్తువులను, పుణ్యయాత్రలను మొదలైనవాటిని ప్రశంసించడం.
  • సభలో ఆచరించే ఉపవాసాలను, ఇంద్రియనిగ్రహ సాధనలను మొదలైనవాటిని ప్రశంసించడం
  • దేవాలయ భవనాలను ప్రశంసించడం
  • సభ ఆజ్ఞలన్నింటినీ ప్రశంసించడం
  • సభలోని అధికారులను, నాయకులను బహిరంగంగా ప్రశంసించడం; వారి గురించిన ఆందోళనలను ఏకాంతంగా, వారి తప్పులను సరిదిద్దడంలో సహాయపడగల వారితో మాత్రమే మాట్లాడడం
  • దైవశాస్త్ర అధ్యయనాన్ని, సభ పండితులను, విశ్వాస సిద్ధాంతాలను ప్రశంసించడం
  • జీవించి ఉన్నవారిని గొప్ప పునీతులతో పోల్చకుండా ఉండడం
  • సభ బోధనలకు దృఢంగా కట్టుబడి ఉండడం
  • రక్షణ, విశ్వాసం, కృప గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం
  • రక్షణ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలను తప్పుడు అవగాహనలోకి గానీ అయోమయంలోకి గానీ నడిపించకుండా జాగ్రత్తపడడం
  • విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు ప్రజలను సోమరితనంలోకి నడిపించకుండా జాగ్రత్తపడడం
  • విశ్వాసం, సత్కార్యాల గురించి మాట్లాడేటప్పుడు తప్పుదోవ పట్టించకుండా స్పష్టంగా చెప్పడం.
  • ప్రజలలో ఘోర పాపం పట్ల భయాన్ని కలిగించడానికి వెనుకాడని ధైర్యం; కేవలం దేవునిపై ప్రేమతో, ఏ విధంగానూ ఆయనను నొప్పించకూడదనే మరింత పరిపూర్ణమైన భయంలోకి ఇతరులను నడిపించే మనోధైర్యం

మీ ఆలోచనలను, కార్యాలను సభతో ఐక్యతలో ఉంచుకోండి. సభ ఆచరణలను, బోధనలను, దివ్యసంస్కారాలను, ప్రేమసేవా కార్యాలను, సువార్త ప్రచార కార్యకలాపాలను, సభను క్రీస్తు వధువుగా నిలిపే సమస్తాన్ని ప్రేమించండి. మీరు సభను ప్రేమిస్తే, వరుడైన క్రీస్తునే తెలుసుకోవడానికి మీలో మరింత సంసిద్ధత కలుగుతుంది.

విషయ సూచిక

పదకొండవ అధ్యాయం: దేవుని చిత్తాన్ని వివేచించడం