ఓ యేసూ,
మరియమ్మ విమలహృదయం ద్వారా,
నీకు సమర్పిస్తున్నాను—నా ప్రార్థనలను, పనులను,
సంతోషాలను, బాధలను,
ఈ రోజుకు చెందిన వీటిని నీ దివ్యహృదయపు
సమస్త సంకల్పాల కొరకు,
ప్రపంచవ్యాప్తంగా అర్పించబడే దివ్యబలిపూజ అనే పవిత్ర యాగంతో
ఐక్యమై,
నా పాపాలకు పరిహారంగా,
నా బంధువులందరి, స్నేహితులందరి సంకల్పాల కొరకు,
ముఖ్యంగా
పరిశుద్ధ పాపుగారి సంకల్పాల కొరకు.
ఆమెన్.
