తెలుగు

పవిత్ర గురువారం కోసం ప్రార్థనా ధ్యానం

నా అత్యంత ప్రియమైన ప్రభువైన యేసూ, ఈ రాత్రి నీవు నీ అపొస్తలులతో కలిసి నీ చివరి భోజనాన్ని పంచుకున్నావు.  కానీ ఇది సాధారణ భోజనం కాదు.  ఇది లోక రక్షణ కోసం త్వరలో సిలువపై విరువబడబోయే నీ అతిపవిత్ర శరీరం, చిందింపబడబోయే నీ అతిపవిత్ర రక్తం అనే వరం.  

ప్రియ ప్రభువా, ఈ రాత్రిని నీతో కలిసి ప్రార్థనలోను ధ్యానంలోను గడపడానికి నన్ను అనుమతించు.  భోజనం తరువాత, నీవు నీ అరెస్టుకు సిద్ధపడుతుండగా, నీతో కలిసి ఒక గంటసేపు మెలకువగా ఉండి జాగరణ చేయమని నీ అపొస్తలులను ఆహ్వానించావు.  అపొస్తలులు నిద్రలోకి జారుకున్నారు; తీవ్రమైన వేదనలో ఉన్న నిన్ను ఒంటరిగా విడిచిపెట్టారు.

ప్రియ ప్రభువా, ఈ రాత్రి నీతో కలిసి జాగరణ చేయమంటూ నీవు ప్రేమతో ఇచ్చే మృదువైన ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను.  నా పాపాల నిమిత్తం నీవు భరించబోయే హింసను ఎదుర్కొంటున్న నీ హృదయంలోకి నేను ప్రవేశించునుగాక.  నీ పవిత్ర హృదయాన్ని నేను ఓదార్చి, దానినుండి ప్రవహించిన ప్రేమను, కారుణ్యాన్ని తెలుసుకొందునుగాక.

ప్రభువా, నా జీవితంలోని సిలువలను నేను ఎదుర్కొన్నప్పుడు, తండ్రి చిత్తానికి “అవును” అని చెప్పడానికి నీ దివ్య ధైర్యాన్ని, బలాన్ని నాకు ప్రసాదించు.  నాపై నీ ప్రేమ అపారమైనది, అన్ని విధాలా పరిపూర్ణమైనది.  ఆ ప్రేమను తెలుసుకోవడానికి, దానిని హత్తుకోవడానికి, నా జీవితంలోకి ఆహ్వానించడానికి నాకు సహాయం చేయు.

ప్రియ ప్రభువా, ఈ రాత్రి నేను నీతో కలిసి జాగరణ చేస్తున్నాను.  నేను నిన్ను ప్రేమిస్తున్నాను; నా పూర్ణహృదయంతో నిన్ను ప్రేమించడానికి నాకు సహాయం చేయు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఆయన చేసినదానిని గ్రహించడం

పవిత్రతకు మన ఆదర్శం

దివ్యసత్ప్రసాదంలో స్వేచ్ఛ

దివ్యబలిపూజలోని ఏకైక నిజమైన బలియాగం

దివ్యసత్ప్రసాదంతో పోషింపబడే సేవా వినయం

పవిత్రతకు మన ఆదర్శం

అత్యున్నత వినయంతో శుద్ధీకరణ

పవిత్ర గురువారం కోసం మరిన్ని

పవిత్ర గురువారం కోసం పఠనం

పవిత్ర వారానికి మరిన్ని

పవిత్ర వారానికి సంబంధించిన దైనందిన ధ్యానాలన్నీ

దైవకారుణ్య ధ్యానాలు

సిలువ పాదాల చెంత 40 రోజులు

జపమాల – దుఃఖ రహస్యాలు (పవిత్ర గ్రంథ వచనాలతో)

వినయ లితనీ

బాధలను సిలువతో ఏకం చేయడం

సంపూర్ణ సమర్పణ ప్రార్థన

సమర్పణ ప్రార్థన

కవిత – బొగ్గుల మంట