సూర్యుని వెలుగు భూమిని వెచ్చబరచినట్లే,
నేను మీ హృదయాన్ని వెచ్చబరుస్తాను.
వేదన కలిగే సమయాల్లో నేను మిమ్మల్ని ఓదారుస్తాను.
అయోమయ సమయాల్లో నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను.
నిరాశా సమయాల్లో నేను మీకు ఆశను కలిగిస్తాను.
వేదన కలిగే సమయాల్లో నేను మీకు ఉపశమనం ఇస్తాను.
అన్యాయం జరిగే సమయాల్లో నేను మీ కోపాన్ని శాంతింపజేస్తాను.
హింసలకు గురయ్యే సమయాల్లో నేను మీకు రక్షణ కల్పిస్తాను.
అప్పుడు ఏ ఆందోళననూ మీరు పట్టించుకోనవసరం లేదు,
ఎందుకంటే నేను మిమ్మల్ని కాపాడుతున్నాను.
మీలో ఏ భయమూ పెరగనివ్వకండి,
ఎందుకంటే నా వాగ్దానాలు మిమ్మల్ని నిరాశపరచవు.
