నా కతోలిక జీవితం! గ్రంథమాల
మొదటి సంపుటి: నా కతోలిక విశ్వాసం!
రెండవ సంపుటి: నా కతోలిక ఆరాధన!
మూడవ సంపుటి: నా కతోలిక నైతికత!
కాపీరైట్ © 2019 నా కతోలిక జీవితం! ఇంక్. మూడవ సవరణ. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి. ఉపయోగం కోసం ప్రతులు తీసుకోవడం గురించి మరింత సమాచారం కోసం www.mycatholic.life/copyright-permission చూడండి.
ఈ మూడవ సవరణలో మునుపటి సంచికలతో పోలిస్తే పుటల అమరికలో స్వల్ప తేడాలు ఉన్నాయి. విషయవస్తువు మారలేదు. పుటల సంఖ్యాక్రమం కొద్దిగా మారింది.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉపయోగించడానికి ఉద్దేశించిన కతోలిక సభ విశ్వాస సంగ్రహం ఆంగ్ల అనువాదం నుండి ఉద్ధృత భాగాలు. కాపీరైట్ © 1994, యునైటెడ్ స్టేట్స్ కాథలిక్ కాన్ఫరెన్స్, ఇంక్.—లిబ్రేరియా ఎడిత్రిచె వాటికానా. అనుమతితో ఉపయోగించబడ్డాయి.
ఈ గ్రంథమంతటా కతోలిక సభ విశ్వాస సంగ్రహం నుండి ఇచ్చిన సూచనలన్నీ విశ్వాస సంగ్రహం లేదా సీసీసీ అని పేర్కొనబడ్డాయి.
ఈ గ్రంథంలోని పవిత్ర గ్రంథ వచనాలు న్యూ అమెరికన్ బైబిల్, సవరించిన సంచిక నుండి తీసుకోబడ్డాయి. © 2010, 1991, 1986, 1970 కాన్ఫ్రటర్నిటీ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్, వాషింగ్టన్, డి.సి. కాపీరైట్ యజమాని అనుమతితో ఇవి ఉపయోగించబడ్డాయి. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి. న్యూ అమెరికన్ బైబిల్లోని ఏ భాగాన్నీ కాపీరైట్ యజమాని నుండి లిఖితపూర్వక అనుమతి లేకుండా ఏ రూపంలోనూ పునరుత్పత్తి చేయకూడదు.
మూడవ సవరణను మొదట ముద్రించినవారు: రిట్మన్ యూనివర్సిటీ ప్రెస్, 104 బి ఉముఆహియా రోడ్, ఇకోట్ ఎక్పెనే, అక్వా ఇబోమ్ రాష్ట్రం, నైజీరియా.
ముద్రణానుమతి:
మహా ఘనతవహించిన కామిల్లస్ రేమండ్ ఉమో గారు
ఇకోట్ ఎక్పెనే మేత్రాసన కతోలిక పీఠాధిపతి
1 డిసెంబర్, 2019
ఆగమనకాల మొదటి ఆదివారం, సంవత్సరం ఎ
అభ్యంతరం లేదు:
ఘనతవహించిన మోన్సిఞోర్ జె. ఎఫ్. ఇయిరె గారు
వికార్ జనరల్
ఇకోట్ ఎక్పెనే మేత్రాసనం
అంకితం
మన ధన్యమాతకు అంకితం. మనపట్ల ఆమె చూపే మాతృసంరక్షణ, దేవుని చిత్తానికి ఆమె చేసుకున్న సంపూర్ణ సమర్పణ, ఆమె శక్తివంతమైన మధ్యస్థ ప్రార్థన అపరిమితమైన వరాలు. ఈ పుటల ద్వారా ఆమె హృదయం ప్రకాశించుగాక; వీటిని చదివే వారందరూ ఆమె విశ్వాసంలో పాలుపొందుదురుగాక.
రచన
జాన్ పాల్ థామస్
అపొస్తలులైన పునీత యోహాను, పునీత తోమా, గొప్ప సువార్త ప్రచారకుడైన పునీత పౌలు గౌరవార్థం ఈ రచయిత ఎంచుకున్న కలం పేరు “జాన్ పాల్ థామస్”. ఈ పేరు గొప్ప పాపుగారైన పునీత రెండవ జాన్ పాల్ జ్ఞాపకాన్ని కూడా రేకెత్తిస్తుంది.
యోహాను తన రక్షకునితో ఎంతో వ్యక్తిగతమైన, సన్నిహితమైన అనుబంధాన్ని కోరుకున్న ప్రియమైన అపొస్తలుడు. ఈ పుస్తకంలోని రచనలు మనందరినీ మన దేవునితో ఎంతో వ్యక్తిగతమైన, సన్నిహితమైన అనుబంధం వైపు నడిపిస్తాయని ఆశిస్తున్నాము. ఈ సాన్నిహిత్యానికి, ప్రేమకు యోహాను ఆదర్శంగా నిలవుగాక.
తోమా కూడా యేసుకు ప్రియమైన అపొస్తలుడు, సన్నిహిత మిత్రుడు. అయితే యేసు పునరుత్థానంపై విశ్వాసం చూపకపోవడం వల్ల ఆయన బాగా ప్రసిద్ధి చెందాడు. చివరికి “నా ప్రభువా, నా దేవా” అని ఎలుగెత్తి పలుకుతూ ప్రగాఢ విశ్వాసంలోకి ప్రవేశించినప్పటికీ, మన విశ్వాస బలహీనతకు ఒక దృష్టాంతంగా ఆయన మనకు ఇవ్వబడ్డాడు. మనం సందేహించామని గుర్తించినప్పుడు ఎల్లప్పుడూ తిరిగి విశ్వాసం వైపు మళ్లేలా తోమా మనకు స్ఫూర్తినివ్వాలి.
పరిసయ్యుడిగా పౌలు తొలి క్రైస్తవ సభను తీవ్రంగా హింసించాడు. అయితే, ప్రగాఢమైన హృదయపరివర్తన పొందిన తరువాత, అన్యజనులకు గొప్ప సువార్త ప్రచారకుడయ్యాడు. విశ్వాసులతో కూడిన అనేక కొత్త సమాజాలను స్థాపించి, పవిత్ర గ్రంథంలో ఉన్న అనేక లేఖలను రాశాడు. ఆయన లేఖలు ఎంతో వ్యక్తిగతమైనవి; అవి ఒక కాపరి హృదయాన్ని వెల్లడిస్తాయి. సువార్తను వ్యాపింపజేయాలనే మన పిలుపును స్వీకరించడానికి ప్రయత్నించే మనందరికీ పౌలు ఒక ఆదర్శం.
నా కతోలిక జీవితం! గ్రంథమాల
మూడు సంపుటాల ఈ గ్రంథమాలకు పరిచయం
ఈ నా కతోలిక జీవితం! గ్రంథమాల మన మహిమాన్వితమైన కతోలిక విశ్వాసానికి సంపూర్ణ సారాంశంగా రాసిన మూడు సంపుటాల గ్రంథమాల! జీవితానికి సంబంధించిన కఠినమైన, లోతైన ప్రశ్నలకు స్పష్టంగా, అర్థమయ్యేలా సమాధానం ఇవ్వడమే ఈ గ్రంథాల లక్ష్యం. మనం ఎవరో, జీవిత పరమార్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరో, యుగయుగాలుగా ఆయన మనకు ఏమి చెప్పాడో మనం తెలుసుకోవాలి.
మొదటి సంపుటమైన నా కతోలిక విశ్వాసం!, అపొస్తలుల విశ్వాస ప్రమాణానికి, నైసీయ విశ్వాస ప్రమాణానికి సారాంశం. ఈ సంపుటం లోక సృష్టి మొదలుకొని దేవుని నిత్య రక్షణ ప్రణాళిక వరకు అన్నిటినీ పరిశీలిస్తుంది. మరణానంతర జీవితం, పరిశుద్ధ త్రిత్వం, పునీతులు, మన ధన్యమాత, విశ్వాసం, కతోలిక సభ వంటి ఇతర అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది కతోలిక సభ విశ్వాస సంగ్రహం #1–1065లోని బోధనల సారాంశం.
రెండవ సంపుటమైన నా కతోలిక ఆరాధన!, ప్రార్థనలోను దివ్యసంస్కారాలలోను లభించే కృపాజీవితానికి సారాంశం. దివ్యసంస్కారాలు తరచూ నిర్జీవమైన, శూన్యమైన ఆచారాలుగా కనిపించవచ్చు. కానీ వాస్తవానికి అవే మనకున్న అత్యంత గొప్ప నిధులు! అవి మన మధ్య దేవుని నిజమైన సాన్నిధ్యం! ఈ గ్రంథం కతోలిక సభ విశ్వాస సంగ్రహం #1066–1690 మరియు #2558–2865లోని అంశాల సారాంశం.
మూడవ సంపుటమైన నా కతోలిక నైతిక జీవితం!, కతోలిక నైతిక బోధనల సారాంశం. ఇది మన విశ్వాసంలోని నైతిక సూత్రాలను తెలియజేయడంతోపాటు మన కతోలిక సభ నైతిక బోధనలన్నిటి సారాంశాన్ని అందిస్తుంది. ఇది కతోలిక సభ విశ్వాస సంగ్రహం #1691–2557లోని అంశాల సారాంశం.

