ప్ర. దివ్యబలిపూజలో సువార్తను వినే ముందు మన తలలపై, పెదవులపై, ఛాతీలపై సిలువ గుర్తు ఎందుకు వేసుకుంటాము?
జ. ఈ ప్రశ్నకు మొదటి, అతి సరళమైన సమాధానం పూజావిధి సూచనల్లో మనకు లభిస్తుంది. దివ్యబలిపూజకు సంబంధించిన పూజావిధి సూచనలు రోమన్ దివ్యబలిపూజా గ్రంథంలో మనకు ఇవ్వబడ్డాయి. అవి దివ్యబలిపూజ క్రమాన్ని తెలియజేస్తాయి. ఎప్పుడు నిలబడాలో, కూర్చోవాలో, మోకరిల్లాలో, ప్రత్యుత్తరాలు చెప్పాలో మొదలైనవి అవి తెలియజేస్తాయి. సువార్త పఠనానికి ముందు మన నుదుటిపై, పెదవులపై, హృదయంపై సిలువ గుర్తు వేసుకోవాలని కూడా అవి చెబుతాయి.
అయితే, బహుశా మీ ప్రశ్న మనం ఇలా చేయడానికి గల “కారణం” గురించి అయి ఉండవచ్చు. సమాధానం సరళమైనదే. మనపై మనం సిలువ గుర్తు వేసుకునే ఈ సంజ్ఞ, “ప్రభువు నా మనస్సులో, నా పెదవులపై, నా హృదయంలో ఉండునుగాక” అని ప్రార్థించే ఒక విధానం. క్రీస్తు పవిత్ర వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, ఆయన ఈ విధాలుగా మన వద్దకు రావాలని ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తూ సువార్త పఠనానికి ముందు ఈ ప్రార్థన చేస్తాము. సువార్తను వినడం మన మనస్సులను మార్చాలి; దానిని మన పెదవులతో ప్రకటించాలి; అది మన హృదయాలను ప్రభావితం చేయాలి. మన హృదయాలు అనడంలో ముఖ్యంగా మన సంకల్పాలు, అనురాగాలు, భావోద్వేగాలు, భావావేశాలను ఉద్దేశిస్తున్నాము.
ఈసారి సువార్త పఠనానికి ముందు మీరు సిలువ గుర్తు వేసుకునేటప్పుడు, అది కేవలం బాహ్య సంజ్ఞగానే మిగిలిపోకుండా చూసుకోండి; అది ఒక ప్రార్థనగా, క్రీస్తుకు ఆహ్వానంగా కూడా ఉండేలా చూసుకోండి.
మరిన్ని కతోలిక ప్రశ్నలు–జవాబులు
