తెలుగు

శుద్ధీకరణ కోసం ప్రార్థన

యేసూ, నాపై, నా శరీరం, మనస్సు, జీవాత్మ, ఆత్మలపై; నా చేతన, ఉపచేతన మనస్సులపై; నా బుద్ధి, సంకల్పాలపై; నా అనుభూతులు, ఆలోచనలు, భావోద్వేగాలు, ఉద్రేకాలపై; నా మాటలు, చేతలపై; నా పిలుపు, నా సంబంధాలు, కుటుంబం, స్నేహితులు, ఆస్తిపాస్తులపై నీ అమూల్య రక్తాన్ని కుమ్మరించు. నా జీవితంలోని ఇతర కార్యకలాపాలన్నిటినీ నీ అమూల్య రక్తంతో కాపాడు. ప్రభువా, వీటన్నిటినీ నీకు అంకితం చేస్తున్నాను; నీవే అన్నిటికీ ప్రభువువనీ, యజమానివనీ అంగీకరిస్తున్నాను.

గర్భధారణ క్షణం నుండే ఆదిపాపరహితురాలవైన మరియా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన, పరిశుద్ధమైన కన్యామాతా, మా ఒక్కొక్కరినీ నీ మేలిముసుగు క్రిందికి చేర్చుకో; పవిత్రత అనే సద్గుణానికి భంగం కలిగించే అన్ని దాడులు, శోధనల నుండి నన్ను కాపాడు, నాకు రక్షణగా నిలువు.

ప్రభువైన యేసుక్రీస్తూ, తండ్రికి మరింత మహిమ కలిగేలా, మన సంరక్షక దేవదూతల సహవాసంలో, మరియమ్మ రక్షణ వస్త్రం క్రింద కాపుదలలో ఉంటూ, పవిత్ర ముళ్లకిరీటానికి ముళ్లు తీసుకున్న పవిత్ర ముళ్లపొద నన్ను చుట్టుముట్టి ఉండగా, పవిత్రాత్మ శక్తిలో నీ అమూల్య రక్తంతో పూర్తిగా తడిసి ఉండే కృపను అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను.

ఆమెన్.


అన్ని ప్రార్థనలు

ఆధ్యాత్మిక పోరాటం కోసం మరిన్ని ప్రార్థనలు

ప్రధాన చిత్రం: క్రీస్తు అమూల్య రక్తం ద్వారా రక్షణ