ఈ నవదిన ప్రార్థనను సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చు. అయితే ప్రత్యేకంగా సామాన్యకాలంలోని ముప్పై రెండవ వారపు శుక్రవారం నుండి ముప్పై మూడవ వారపు శనివారం వరకు (విశ్వరాజైన యేసుక్రీస్తు మహోత్సవానికి ముందున్న తొమ్మిది రోజులు) చేయండి.
విశ్వరాజైన మన ప్రభువగు యేసుక్రీస్తు మహోత్సవం
ప్రతిరోజు చేయవలసిన నవదిన ప్రార్థనలు:
పిత, కుమార, పవిత్రాత్మ నామమున. ఆమేన్.
సర్వశక్తిమంతుడవూ కరుణామయుడవూ అయిన దేవా, నీవు దుష్టశక్తి ఆధిపత్యాన్ని భగ్నం చేసి, విశ్వరాజైన నీ కుమారుడు యేసుక్రీస్తులో సమస్తాన్ని నూతనపరుస్తున్నావు. పరలోకంలోనూ భూమిపైనా ఉన్నవారందరూ నీ మహిమను కీర్తించుదురుగాక, నిన్ను నిరంతరం స్తుతించుదురుగాక.
నీతోను పవిత్రాత్మతోను ఏక దేవుడై యుగయుగములు జీవించి పరిపాలించే నీ కుమారుడు, మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దీనిని వేడుకుంటున్నాము. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రీ…
నమో మరియమ్మా…
పిత పుత్ర పవిత్రాత్మలకు స్తోత్రము…
మనం ప్రార్థిద్దాం:
ఓ మా ప్రభువా, మా దేవా, నీవొక్కడవే అతిపరిశుద్ధ రాజువు, సమస్త జాతులకు పాలకుడవు.
ఓ ప్రభువా, దివ్యరాజా, నీ నుండి కరుణను, శాంతిని, న్యాయాన్ని, సమస్త మేలులను పొందుతామనే గొప్ప ఆశతో నిన్ను ప్రార్థిస్తున్నాము.
ఓ ప్రభువా, మా రాజా, మా కుటుంబాలను, మా జన్మభూమిని కాపాడు.
పరమ విశ్వాసపాత్రుడా, మమ్మల్ని సంరక్షించమని వేడుకుంటున్నాము.
మా శత్రువుల నుండి, నీ న్యాయమైన తీర్పు నుండి మమ్మల్ని కాపాడు.
ఓ సర్వాధికార రాజా, నీకు విరుద్ధంగా మేము చేసిన పాపాలను క్షమించు.
యేసూ, నీవు కరుణగల రాజువు.
మేము నీ న్యాయమైన తీర్పుకు పాత్రులమయ్యాము.
ప్రభువా, మమ్మల్ని కరుణించి క్షమించు.
నీ మహా కారుణ్యంపై మేము నమ్మకం ఉంచుతున్నాము.
ఓ అత్యంత భయభక్తులు కలిగించే రాజా, నీ ఎదుట శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాము;
భూమిపై నీ పరిపాలనకు, నీ రాజ్యానికి గుర్తింపు లభించుగాక.
ఆమెన్.
ఐచ్ఛికం: శాంతి కోసం ప్రార్థనలు
