
క్రీస్తు ఆత్మా, నన్ను పవిత్రపరచుము
క్రీస్తు దేహమా, నన్ను రక్షించుము
క్రీస్తు రక్తమా, నన్ను మత్తిల్లజేయుము
క్రీస్తు ప్రక్కనుండి వచ్చిన జలమా, నన్ను కడుగుము
క్రీస్తు శ్రమానుభవమా, నన్ను బలపరచుము
ఓ మంచివాడవైన యేసూ, నా మొర ఆలకించుము
నీ గాయాలలో నన్ను దాచుము
నీ నుండి నేను వేరుపడనీయకుము
దుష్ట శత్రువు నుండి నన్ను కాపాడుము
నా మరణ ఘడియలో నన్ను పిలువుము
నీ చెంతకు రమ్మని నన్ను ఆజ్ఞాపించుము
నేను నీ పునీతులతో కలిసి నిన్ను స్తుతించుటకు
నీ దేవదూతలతోనూ కలిసి
నిత్యనిత్యము.
ఆమేన్