తెలుగు

కారుణ్య సంవత్సర ప్రార్థన

యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

కారుణ్య సంవత్సరం కోసం పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థన

ప్రభువైన యేసు క్రీస్తూ, పరలోక తండ్రివలె కరుణ కలిగి ఉండాలని నీవు మాకు బోధించావు; నిన్ను చూసేవారు తండ్రిని చూస్తారని మాకు చెప్పావు. నీ ముఖాన్ని మాకు చూపించు, అప్పుడు మేము రక్షణ పొందుతాము.

నీ ప్రేమపూర్వక చూపు జక్కయ్యను, మత్తయిని ధనదాస్యం నుండి విడిపించింది;
వ్యభిచారిణిని, మగ్దలేనాను సృష్టించబడిన వాటిలో మాత్రమే సంతోషాన్ని వెదకడం నుండి విడిపించింది;
పేతురు నిన్ను నిరాకరించిన తరువాత కన్నీరు పెట్టుకునేలా చేసింది,
పశ్చాత్తాపపడిన దొంగకు పరదైసును వాగ్దానం చేసింది.

సమరయ స్త్రీతో నీవు పలికిన మాటలను మా ఒక్కొక్కరితో పలికినట్లుగా మేము వినేలా చేయి: “దేవుని వరం నీకు తెలిసి ఉంటే!”

కనిపించని తండ్రికి, అన్నిటికంటే ముఖ్యంగా క్షమాపణ ద్వారా, కరుణ ద్వారా తన శక్తిని వెల్లడిచేసే దేవునికి, నీవు కనిపించే ముఖానివి: మృతులలోనుండి లేచి మహిమపరచబడిన తన ప్రభువైన నీకు, సభ ఈ లోకంలో కనిపించే ముఖంగా ఉండునుగాక.

అజ్ఞానంలోను, తప్పుదారిలోను ఉన్నవారిపట్ల జాలి చూపగలిగేలా నీ సేవకులు కూడా బలహీనతను ధరించి ఉండాలని నీవు సంకల్పించావు: వారిని సమీపించే ప్రతి ఒక్కరూ దేవుడు తమను వెదుకుతున్నాడని, ప్రేమిస్తున్నాడని, క్షమిస్తున్నాడని అనుభూతి చెందునుగాక.

నీ ఆత్మను పంపి, ఆయన అభిషేకంతో మా ఒక్కొక్కరినీ పవిత్రపరచు. తద్వారా కారుణ్య జూబిలీ ప్రభువు అనుగ్రహించే కృపా సంవత్సరంగా ఉండునుగాక; నీ సభ నూతనోత్సాహంతో పేదలకు సువార్తను అందించి, బందీలకు, అణచివేతకు గురైనవారికి విముక్తిని ప్రకటించి, అంధులకు తిరిగి చూపును ప్రసాదించునుగాక.

తండ్రితోను, పవిత్రాత్మతోను యుగయుగాలు జీవించి పరిపాలించే నిన్ను, కారుణ్యమాత మరియ మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము ఇది వేడుకుంటున్నాము.

ఆమెన్.

మరిన్ని దైవకారుణ్య ప్రార్థనలు

ఇది కూడా చూడండి: దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు