“ప్రతిరోజూ జపమాల ప్రార్థించే వారెవరూ ఎన్నటికీ దారితప్పరు. ఈ మాటకు నా రక్తంతో సంతోషంగా సంతకం చేస్తాను.”
పునీత లూయీ డి మోంట్‌ఫోర్ట్
“ప్రార్థనలన్నిటిలో జపమాల అత్యంత సుందరమైనది, అనుగ్రహాలతో అత్యంత సమృద్ధమైనది…జపమాలను ప్రేమించండి, ప్రతిరోజూ భక్తితో ప్రార్థించండి.”
పునీత పదవ పయస్
“ప్రతి సాయంత్రం జపమాల ప్రార్థించే కుటుంబం ఎంత సుందరమైనది.”
పునీత రెండవ జాన్ పాల్
“జపమాల నాకు అత్యంత ప్రియమైన ప్రార్థన. అద్భుతమైన ప్రార్థన! దాని సరళతలోనూ, గాఢతలోనూ అద్భుతమైనది.”
పునీత రెండవ జాన్ పాల్
ఫాదర్ గ్రోషెల్ మదర్ తెరేసా గురించి ఇలా అన్నారు:
“మదర్ తెరేసాకు సైతం జపమాల కేవలం భక్తి కార్యం మాత్రమే కాదు; కొన్ని సమయాల్లో అంతరంగంలోని అంధకారపు తుఫానుల మధ్య ఆశ్రయస్థానం కూడా.”
“జపమాల దేవుని ప్రేరణతో లభించిన అమూల్యమైన నిధి.”
పునీత లూయిస్ డి మోంట్‌ఫోర్ట్
“కుటుంబంపై దేవుని ఆశీర్వాదాలను పొందడానికి… ప్రతిరోజూ జపమాల ప్రార్థించడం కంటే నిశ్చయమైన మార్గం మరొకటి లేదు.”
పునీత పన్నెండవ పయస్
“జపమాల అత్యుత్తమమైన ప్రార్థనా రూపం, నిత్యజీవాన్ని పొందడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనం. అది మన కీడులన్నింటికీ నివారణ, మన ఆశీర్వాదాలన్నింటికీ మూలం. ఇంతకన్నా శ్రేష్ఠమైన ప్రార్థనా విధానం మరొకటి లేదు.”
పునీత పదమూడవ లియో
“జపమాల ప్రార్థించే ఒక సైన్యాన్ని నాకు ఇవ్వండి, నేను ప్రపంచాన్ని జయిస్తాను.”
ధన్య తొమ్మిదవ పయస్ పాపుగారు
“మీ హృదయాలలో, మీ ఇళ్లలో, మీ దేశంలో శాంతిని కోరుకుంటే, ప్రతి సాయంత్రం జపమాల ప్రార్థించడానికి ఒకచోట చేరండి. ఎన్నో చింతలతో, పనులతో ఎంతగా సతమతమవుతున్నా, జపమాల ప్రార్థించకుండా ఒక్కరోజు కూడా గడవనివ్వకండి.”
పదకొండవ పయస్ పాపుగారు
“జపమాల ప్రార్థన ద్వారా నేను అడిగిన ఏ అనుగ్రహాన్నీ మన మరియమాత ఎన్నడూ నిరాకరించలేదు.”
పీట్రెల్చీనాకు చెందిన పునీత పాద్రే పియో
“ప్రార్థించడానికి అత్యంత శ్రేష్ఠమైన విధానం జపమాల ప్రార్థించడమే.”
పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్
“ఒకరోజు, జపమాల ద్వారా, స్కాపులర్ ద్వారా మన మరియమాత ప్రపంచాన్ని రక్షిస్తారు.”
పునీత దొమినిక్
