
పవిత్ర జపమాలపై పునీతుల సూక్తులు
ఇవి కూడా చూడండి: జపమాలపై ధ్యానాలు
పరలోక శ్రేణిలో ఆరోహణ నుండి
జపమాల పవిత్ర గ్రంథంపై ఆధారపడిన ప్రార్థన. ఇది కతోలిక విశ్వాసంలోని గొప్ప దేవరహస్యాలను సంక్షిప్తంగా తెలిపే అపొస్తలుల విశ్వాస ప్రమాణంతో ప్రారంభమవుతుంది. ప్రతి దేవరహస్యం ప్రారంభంలో చెప్పే పరలోక జపం సువార్తల నుండి తీసుకోబడింది. నమో మరియా జపంలోని మొదటి భాగం క్రీస్తు జననాన్ని ప్రకటించిన దేవదూత మాటలు, మరియను ఎలిసబెతు పలకరించిన మాటలతో కూడి ఉంటుంది. పునీత ఐదవ పయస్ నమో మరియా జపంలో రెండవ భాగాన్ని అధికారికంగా చేర్చారు. జపమాల దేవరహస్యాలు క్రీస్తు జీవితంలోని సంఘటనలపై కేంద్రీకృతమై ఉంటాయి. దేవరహస్యాలు నాలుగు విభాగాలుగా ఉన్నాయి: సంతోష దేవరహస్యాలు, దుఃఖ దేవరహస్యాలు, మహిమ దేవరహస్యాలు, అలాగే––2002లో రెండవ జాన్ పాల్ పాపుగారు చేర్చిన––వెలుగు దేవరహస్యాలు.
జపమాలలోని పునరావృతం ప్రతి దేవరహస్యానికి సంబంధించిన ప్రశాంతమైన, ధ్యానపూర్వకమైన ప్రార్థనలోకి మనలను నడిపించడానికి ఉద్దేశించబడింది. పదాలను నెమ్మదిగా మళ్లీ మళ్లీ పలకడం, క్రీస్తు ఆత్మ నివసించే మన హృదయాల నిశ్శబ్దంలోకి ప్రవేశించడానికి మనకు తోడ్పడుతుంది. జపమాలను వ్యక్తిగతంగా గానీ, బృందంతో కలిసి గానీ ప్రార్థించవచ్చు.
మీరు జపించాలనుకునే దేవరహస్యాలను ఎంచుకోండి. ప్రతి పేజీలో పవిత్ర గ్రంథ పఠనాలు, జపమాల ప్రార్థనలు, ఒక ఆడియో రికార్డింగ్ ఉన్నాయి. లేదా యూట్యూబ్లో కలిసి జపించండి.
సంప్రదాయంగా సోమవారాలు, శనివారాలు, ఆగమనకాల ఆదివారాలలో ధ్యానిస్తూ ప్రార్థిస్తారు.
సంప్రదాయంగా గురువారాలలో ధ్యానిస్తూ ప్రార్థిస్తారు.
సంప్రదాయంగా మంగళవారాలు, శుక్రవారాలు, తపస్సుకాల ఆదివారాలలో ధ్యానిస్తూ ప్రార్థిస్తారు.
సంప్రదాయంగా బుధవారాలలోనూ, తపస్సుకాలం, ఆగమనకాలం మినహా మిగిలిన కాలాల్లోని ఆదివారాలలోనూ ధ్యానిస్తూ ప్రార్థిస్తారు.
జపమాల ప్రార్థనలను మీరు పరిచయం చేసుకోండి, మీ బృందానికి పరిచయం చేయండి లేదా రెండూ చేయండి.

- సిలువ గుర్తు వేసుకోండి.
- సిలువ స్వరూపాన్ని పట్టుకొని, అపొస్తలుల విశ్వాస ప్రమాణం చెప్పండి.
- మొదటి పూసపై ఒకసారి పరలోక జపం చెప్పండి.
- తరువాతి మూడు పూసలలో ఒక్కొక్కదానిపై ఒక్కొక్కసారి నమో మరియ జపం చెప్పండి.
- త్రిత్వ స్తోత్రం చెప్పండి.
- ఐదు పదులలో ప్రతి పదికి ముందు దేవరహస్యాన్ని ప్రకటించండి (ఆ తరువాత, కావాలనుకుంటే, పైన ఉన్న సంబంధిత దేవరహస్యపు పేజీలో ఇచ్చిన పవిత్ర గ్రంథ పఠనాన్ని చదవండి). ఆపై పరలోక జపం చెప్పండి.
- దేవరహస్యాన్ని ధ్యానిస్తూ, తరువాతి పది పూసలలో ఒక్కొక్కదాన్ని వేళ్లతో తాకుతూ, పది నమో మరియ జపాలు చెప్పండి.
- ఆ తరువాత ఒకసారి త్రిత్వ స్తోత్రం చెప్పండి.
- ప్రతి పది పూర్తయిన తరువాత, ఫాతిమాలో ధన్య కన్య మరియమాత కోరిన ఈ ప్రార్థనను కొందరు చెబుతారు:
ఓ నా యేసూ, మా పాపాలను క్షమించు, నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించు; ఆత్మలందరినీ పరలోకానికి నడిపించు, ముఖ్యంగా నీ కరుణ అత్యంత అవసరమైన ఆత్మలను.
ఐదు పదులు చెప్పిన తరువాత, ఈ ప్రార్థన చెప్పండి:
- పవిత్ర రాణీ, నీకు వందనం
- ఐచ్ఛికం: ముగింపు ప్రార్థన
- ఐచ్ఛికం: పునీత మిఖాయేలు ప్రార్థన
- ఐచ్ఛికం: పునీత యోసేపునకు ప్రార్థన
- ఐచ్ఛికం: బాధా సమయాల కోసం పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనల ఆధారంగా రూపొందించిన ప్రార్థనలు
ఇక్కడి పాఠ్యంలో అధిక భాగం, జపమాల చిత్రం అమెరికా సంయుక్త రాష్ట్రాల బిషప్పుల వెబ్ పేజీ నుండి తీసుకోబడ్డాయి: జపమాల ఎలా జపించాలి.
బిషప్పులకు, యు.ఎస్.సి.సి.బి. సిబ్బందికి ధన్యవాదాలు! మా ప్రార్థనల్లో మిమ్మల్ని స్మరించుకుంటున్నాము!
