మీ కష్టాలు గతించిపోతాయి.
మీ బాధలు తొలగిపోతాయి.
మీ అయోమయం తగ్గిపోతుంది.
మీ నిరీక్షణ పెరుగుతుంది.
మీ హృదయం పవిత్రతతో నిండిపోతుంది,
మీరు మీ జీవితాన్ని నా చేతుల్లో ఉంచినప్పుడు.
మీ ఆత్మసమర్పణకు భయాలు అడ్డురానివ్వకండి.
ఆందోళన మీ దృష్టిని నా నుంచి మరల్చనివ్వకండి.
స్వార్థం మిమ్మల్ని తప్పుదారి పట్టించనివ్వకండి.
మీరు వెదుకుతూ, కోరుకునే గమ్యాన్ని నేనే.
మీరు తపిస్తూ, అన్వేషించే శక్తిని నేనే.
మీరు కోరుకునే ముగింపును నేనే.
మిమ్మల్ని మీరు విడిచిపెట్టి, మీ జీవితాన్ని నాకు సమర్పించండి.
మిమ్మల్ని నిర్బంధించి, తప్పుదారి పట్టించేవాటిని పక్కకు నెట్టి, నాతో చేరండి.
నా భూభాగాలలోని ప్రదేశాలకు మిమ్మల్ని పైకెత్తనివ్వండి.
మీ రాక కోసం నా ఇల్లు ఎదురుచూస్తోంది.
నా సేవకులు మీ గదిని సిద్ధం చేశారు.
ఇతర కాలాలకు చెందినవారి పేర్లతో పాటు మీ పేరు కూడా జాబితాలో చేర్చబడింది.
నా చెంత మీ స్థానం మీ కోసం ఎదురుచూస్తోంది.
మీ ఆకాంక్షలు ఉన్నతమగనివ్వండి, నా వాక్యంపై నమ్మకం ఉంచండి,
ఎందుకంటే మీరు నా దేశానికి చెందినవారు.
ఈ సంఘటన కోసం ఎదురుచూస్తూ ప్రతి రోజూ జీవించండి,
నా చెంత మీ స్థానం మీ కోసం ఎదురుచూస్తోందని తెలుసుకొని.
