పునీత అల్ఫోన్సస్ లిగోరి రచించిన రాత్రి ప్రార్థన
నా దేవుడవైన యేసుక్రీస్తూ, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ రోజు నీవు నాకు అనుగ్రహించిన అనేక మేలులకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నా నిద్రను, ఈ రాత్రిలోని ప్రతి క్షణాన్ని నీకు సమర్పిస్తున్నాను. నన్ను పాపం నుండి కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నాను. అందుచేత, నీ అతిపవిత్ర పార్శ్వంలోను, నా తల్లియైన మన ధన్యమాత అంగవస్త్రం క్రిందను నన్ను నేను ఉంచుకుంటున్నాను. పరిశుద్ధ దేవదూతలు నాకు సహాయమై, నన్ను శాంతిలో ఉంచుదురు గాక. నీ ఆశీర్వాదం నాపై ఉండుగాక. ఆమెన్.
