తెలుగు

ప్రచురణ హక్కులు మరియు అంకితం

ప్రచురణ హక్కులు © 2017 నా కతోలిక జీవితం! ఇంక్. సర్వహక్కులు ప్రత్యేకించబడ్డాయి.  mycatholic.life

ఈ గ్రంథంలోని పవిత్ర గ్రంథ వచనాలు న్యూ అమెరికన్ బైబిల్, సవరించిన సంచిక నుండి తీసుకోబడ్డాయి. © 2010, 1991, 1986, 1970 క్రైస్తవ సిద్ధాంత సహోదర సంఘం, వాషింగ్టన్, డి.సి. ప్రచురణ హక్కుల యజమాని అనుమతితో ఇవి ఉపయోగించబడ్డాయి. సర్వహక్కులు ప్రత్యేకించబడ్డాయి. ప్రచురణ హక్కుల యజమాని నుండి లిఖితపూర్వక అనుమతి లేకుండా న్యూ అమెరికన్ బైబిల్‌లోని ఏ భాగాన్నీ ఏ రూపంలోనూ పునరుత్పత్తి చేయరాదు.

ముఖచిత్రం: AntanO రూపొందించినది (స్వీయ కృతి) (https://creativecommons.org/licenses/by-sa/3.0)], వికీమీడియా కామన్స్ ద్వారా


అంకితం

వినయం, నమ్మకం, కరుణ అనే సద్గుణాలను పరిపూర్ణంగా ఆచరించిన మన ధన్యమాతకు అంకితం.  ఇప్పుడు ఆమె హృదయం నుండి ప్రసరిస్తున్న సౌందర్యం, ఆమెను ఆదరించే వారందరికీ నిత్యమూ అపారమైన ఆనందానికి మూలమవుతుంది.

మరియమాతా, మా కొరకు ప్రార్థించుము; ప్రతిదినం పరిశుద్ధతా మార్గాన్ని వెదకడానికి మమ్మల్ని ప్రేరేపించుము.


యోహాను పౌలు తోమా

అపొస్తలులైన పునీత యోహాను, పునీత తోమా, గొప్ప సువార్త ప్రచారకుడైన పునీత పౌలు గౌరవార్థం ఈ గురువు ఎంచుకున్న కలంపేరు “యోహాను పౌలు తోమా”.  ఈ పేరు గొప్ప పోప్ పునీత రెండవ జాన్ పాల్ జ్ఞాపకాన్ని కూడా మేల్కొలుపుతుంది.

యోహాను తన రక్షకునితో ఎంతో వ్యక్తిగతమైన, సన్నిహితమైన అనుబంధాన్ని కోరుకున్న ప్రియమైన అపొస్తలుడు.  ఈ పుస్తకంలోని రచనలు మనందరినీ మన దేవునితో ఎంతో వ్యక్తిగతమైన, సన్నిహితమైన అనుబంధం వైపు నడిపిస్తాయని ఆశిస్తున్నాము.  ఈ సాన్నిహిత్యానికి, ప్రేమకు యోహాను ఆదర్శంగా నిలవుగాక.

తోమా కూడా ప్రియమైన అపొస్తలుడు, యేసుకు సన్నిహిత మిత్రుడు. అయితే యేసు పునరుత్థానంపై విశ్వాసం లేకపోయినందుకు ఆయన ప్రసిద్ధుడు.  చివరికి “నా ప్రభువా, నా దేవా” అని ఎలుగెత్తి పలుకుతూ గాఢమైన విశ్వాసాన్ని పొందినప్పటికీ, మన స్వంత విశ్వాస బలహీనతకు ఒక నిదర్శనంగా తోమా మనకు ఇవ్వబడ్డారు.  మనం సందేహించామని గ్రహించినప్పుడు ఎల్లప్పుడూ తిరిగి విశ్వాసం వైపు మళ్లడానికి తోమా మనకు ప్రేరణ కావాలి.

పరిసయ్యుడిగా ఉన్నప్పుడు పౌలు తొలి క్రైస్తవ సభను తీవ్రంగా హింసించారు.  అయితే, గాఢమైన హృదయపరివర్తన పొందిన తరువాత, అన్యజనులకు గొప్ప సువార్త ప్రచారకుడయ్యారు. విశ్వాసులతో అనేక కొత్త సంఘాలను స్థాపించి, పవిత్ర గ్రంథంలో చోటుచేసుకున్న అనేక లేఖలను రాశారు.  ఆయన లేఖలు ఎంతో వ్యక్తిగతంగా ఉండి, ఒక కాపరి హృదయాన్ని వెల్లడిస్తాయి.  సువార్తను వ్యాప్తి చేయాలనే మన పిలుపును స్వీకరించడానికి ప్రయత్నించే మనందరికీ ఆయన ఆదర్శం.

విషయ సూచిక


ఈ-పుస్తకంగా లేదా పేపర్‌బ్యాక్ పుస్తకంగా కూడా లభిస్తుంది:

అమెజాన్ – గూగుల్ ప్లే – ఐట్యూన్స్ – బార్న్స్ అండ్ నోబుల్