తెలుగు

ధన్య కన్య మరియమ్మ లితాని

లోరెటో మాత లితాని

ప్రభువా, మమ్ము కరుణింపుము. 

క్రీస్తూ, మమ్ము కరుణింపుము. 

ప్రభువా, మమ్ము కరుణింపుము. 

క్రీస్తూ, మా మనవి ఆలకింపుము. 

క్రీస్తూ, దయతో మా మనవి ఆలకింపుము. 

పరలోకపు తండ్రియైన దేవా, మమ్ము కరుణింపుము. 

లోక విమోచకుడవైన పుత్ర దేవా, మమ్ము కరుణింపుము. 

పవిత్రాత్మయైన దేవా, మమ్ము కరుణింపుము. 

ఏక దేవుడవైన పవిత్ర త్రిత్వమా, మమ్ము కరుణింపుము. 

పవిత్ర దేవమాతా, మా కొరకు ప్రార్థించుము.

కన్యలలో పవిత్ర కన్యా, మా కొరకు ప్రార్థించుము.

క్రీస్తు మాతా, మా కొరకు ప్రార్థించుము.

దివ్య కృపకు మాతా, మా కొరకు ప్రార్థించుము.

అత్యంత నిర్మలమైన మాతా, మా కొరకు ప్రార్థించుము.

అత్యంత పవిత్రశీలవతియైన మాతా, మా కొరకు ప్రార్థించుము.

కన్యత్వం చెక్కుచెదరని మాతా, మా కొరకు ప్రార్థించుము.

మలినం లేని మాతా, మా కొరకు ప్రార్థించుము.

అత్యంత ప్రీతిపాత్రమైన మాతా, మా కొరకు ప్రార్థించుము.

అత్యంత ప్రశంసనీయమైన మాతా, మా కొరకు ప్రార్థించుము.

సత్సలహా మాతా, మా కొరకు ప్రార్థించుము.

మా సృష్టికర్త మాతా, మా కొరకు ప్రార్థించుము.

మా రక్షకుని మాతా, మా కొరకు ప్రార్థించుము.

అత్యంత వివేకవతియైన కన్యా, మా కొరకు ప్రార్థించుము.

అత్యంత పూజనీయమైన కన్యా, మా కొరకు ప్రార్థించుము.

అత్యంత సుప్రసిద్ధమైన కన్యా, మా కొరకు ప్రార్థించుము.

అత్యంత శక్తిమంతురాలైన కన్యా, మా కొరకు ప్రార్థించుము.

అత్యంత కరుణామయియైన కన్యా, మా కొరకు ప్రార్థించుము.

అత్యంత విశ్వాసపాత్రురాలైన కన్యా, మా కొరకు ప్రార్థించుము.

నీతి దర్పణమా, మా కొరకు ప్రార్థించుము.

జ్ఞాన సింహాసనమా, మా కొరకు ప్రార్థింపుము.

మా ఆనందానికి కారణమా, మా కొరకు ప్రార్థింపుము.

ఆధ్యాత్మిక పాత్రమా, మా కొరకు ప్రార్థింపుము.

ఘనతగల పాత్రమా, మా కొరకు ప్రార్థింపుము.

భక్తికి అనుపమాన పాత్రమా, మా కొరకు ప్రార్థింపుము.

మార్మిక గులాబీ పుష్పమా, మా కొరకు ప్రార్థింపుము.

దావీదు గోపురమా, మా కొరకు ప్రార్థింపుము.

దంతపు గోపురమా, మా కొరకు ప్రార్థింపుము.

బంగారు మందిరమా, మా కొరకు ప్రార్థింపుము.

నిబంధన మందసమా, మా కొరకు ప్రార్థింపుము.

పరలోక ద్వారమా, మా కొరకు ప్రార్థింపుము.

వేకువ చుక్కా, మా కొరకు ప్రార్థింపుము.

రోగుల ఆరోగ్యమా, మా కొరకు ప్రార్థింపుము.

పాపుల ఆశ్రయమా, మా కొరకు ప్రార్థింపుము.

బాధితుల ఓదార్పుదాయినీ, మా కొరకు ప్రార్థింపుము.

క్రైస్తవుల సహాయమా, మా కొరకు ప్రార్థింపుము.

దేవదూతల రాణీ, మా కొరకు ప్రార్థింపుము.

పితరుల రాణీ, మా కొరకు ప్రార్థింపుము.

ప్రవక్తల రాణీ, మా కొరకు ప్రార్థింపుము.

అపొస్తలుల రాణీ, మా కొరకు ప్రార్థింపుము.

హతసాక్షుల రాణీ, మా కొరకు ప్రార్థింపుము.

విశ్వాస సాక్షుల రాణీ, మా కొరకు ప్రార్థింపుము.

కన్యల రాణీ, మా కొరకు ప్రార్థింపుము.

పునీతులందరి రాణీ, మా కొరకు ప్రార్థింపుము.

జన్మపాపం లేకుండా గర్భంలో ఉద్భవించిన రాణీ, మా కొరకు ప్రార్థింపుము.

అత్యంత పవిత్ర జపమాల రాణీ, మా కొరకు ప్రార్థింపుము. 

లోక పాపాలను తొలగించే దేవుని గొర్రెపిల్లా, ఓ ప్రభువా, మమ్మల్ని శిక్షించక విడిచిపెట్టుము! 

లోక పాపాలను తొలగించే దేవుని గొర్రెపిల్లా, ఓ ప్రభువా, దయతో మా ప్రార్థన ఆలకింపుము! 

లోక పాపాలను తొలగించే దేవుని గొర్రెపిల్లా, మమ్మల్ని కరుణింపుము. 

వ. ఓ పవిత్ర దేవమాతా, మా కొరకు ప్రార్థింపుము! 

జ. మేము క్రీస్తు వాగ్దానాలకు పాత్రులమగునట్లు. 

ప్రార్థించుదాము.

0 ప్రభువైన దేవా, నీ సేవకులమైన మేము ఆత్మదేహాల నిరంతర ఆరోగ్యంతో దీవించబడునట్లును, ధన్యురాలైన నిత్యకన్య మరియమ్మ మహిమాన్విత మధ్యస్థ ప్రార్థనవలన ప్రస్తుత దుఃఖాలనుండి విముక్తి పొంది, నిత్యానందాలకు చేర్చబడునట్లును అనుగ్రహించుమని నిన్ను వేడుకుంటున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా. ఆమేన్. 

వ. ఓ పునీత యోసేపూ, మా కొరకు ప్రార్థించుము! 

జ. మేము క్రీస్తు వాగ్దానాలకు పాత్రులమగునట్లు. 

ప్రార్థించుదాము.

ఓ దేవా! నీ అనిర్వచనీయమైన దైవపాలనలో నీ పరమపవిత్ర మాతకు భర్తగా ధన్యుడైన యోసేపును ఎన్నుకున్నావు. భూమిపై మా సంరక్షకునిగా మేము గౌరవించే ఆయన పరలోకంలో మా కొరకు మధ్యస్థ ప్రార్థన చేయునట్లు అనుగ్రహించుమని నిన్ను వేడుకుంటున్నాము. 

ఆమెన్.

మరిన్ని ప్రార్థనలు

దైనందిన ధ్యానాలు


ప్రధాన చిత్రం

ఈ పేజీలోని చిత్రం

1899లో ప్రచురించబడిన “ కతోలికుల జేబు ప్రార్థనా పుస్తకం నుండి ప్రార్థనలు.

ముద్రణానుమతి:
మైఖేల్ అగస్టిన్,
న్యూయార్క్ ప్రధాన పీఠాధిపతి.
న్యూయార్క్, అక్టోబర్ 13, 1899.