నాకు చేరువ కండి.
నా కోసం వెదకండి.
మీలో ప్రవేశించడానికి నన్ను అనుమతించండి.
మీ హృదయాన్ని నాకు తెరవండి.
మీకు శాంతిని చేకూర్చడానికి నన్ను అనుమతించండి.
మీ భయాలను నా వద్దకు తీసుకురండి.
మీ మనసును నాకు తెరవండి.
మీ చింతలను నాపై మోపండి.
మీ సందేహాలను విడిచిపెట్టండి.
మీకు శాంతిని ఇవ్వడానికి నన్ను అనుమతించండి.
మీ భయాలను విడిచిపెట్టండి.
నాలో భాగం కండి.
మీరు నా చెంత ఉండండి.
మిమ్మల్ని మీరు నాకు అప్పగించుకోండి.
మీలో నివసించడానికి నన్ను అనుమతించండి.
మీలో భాగం కావడానికి నన్ను అనుమతించండి.
నన్ను తెలుసుకొని అంగీకరించండి,
అప్పుడు నా సర్వస్వమూ ఈ రోజు మీదవుతుంది.
నేను వెలుగును, శాంతిని చేకూరుస్తాను
ఈ వరాలను కోరుకునేవారికి.
ఆనందాన్ని ఆశించేవారికి దానిని ఇస్తాను.
ఈ ఆశీర్వాదాలను అడగండి,
అవి మీకు ఇవ్వబడతాయి.
నా జీవాన్ని కోరుకోండి,
అందులో మీకూ భాగం ఇవ్వబడుతుంది.
నా మాటలను అర్థం చేసుకోండి
వాటి సందేశంలో ఆనందించండి.
మీ హృదయంతో నా వైపు తిరగండి,
అప్పుడు మీరు నన్ను తెలుసుకుంటారు.
నా కోసం కృషి చేయండి, నాలో భాగం కండి.
నా సర్వస్వమూ, నేను చేసే సమస్తమూ
మీకు తెలుస్తాయి
మీరు నాతో కలిసినప్పుడు.
