తెలుగు

నా బహుమతి

విశ్వాసం మీకు నేనిచ్చే వరం;
  అది మిమ్మల్ని నిరీక్షణతోనూ నమ్మికతోనూ నింపనివ్వండి.
దాని శక్తిని గాని ఫలితాన్ని గాని సందేహించకండి;
  అది మిమ్మల్ని కృపతో నింపనివ్వండి.

మీరు ఆందోళన చెందనవసరం లేదు, భయపడనవసరం లేదు;
  మీ హృదయాన్ని శాంతితో నిండనివ్వండి.
ఈ శాంతి లేకుండా ఒక్క రోజు కూడా గడవనివ్వకండి.

ఈ విశ్వాసం మిమ్మల్ని తీర్చిదిద్దనిస్తే,
  ఇక మీ మనస్సు దేని గురించి చింతించాలి?
అప్పుడు మిమ్మల్ని కబళించగలది ఏమిటి?
అప్పుడు మిమ్మల్ని చుట్టుముట్టి బెదిరించేది ఏమిటి?

ఈ విశ్వాసాన్ని మీలో నిలిచియుండమని ఆహ్వానించండి,
  అప్పుడు నా శాంతి మీలో నివసిస్తుంది.

తదుపరి ధ్యానం

విషయ సూచిక